water: నీళ్లు చోరీ చేస్తారని.. వాటర్‌ డ్రమ్‌లకు తాళాలు వేసుకుంటోన్న అజ్మీర్‌ వాసులు

  • నీటి ఎద్దడి తీవ్రం
  • నీళ్లు దొరికినప్పుడే డ్రమ్ములు నింపుకుని నిల్వ
  • తాగు నీటి కోసం ప్రజల అవస్థలు

నీళ్లు ఎవరైనా చోరీ చేస్తారేమోనని రాజస్థాన్‌ అజ్మీర్‌లోని విశాల్‌ నగర్ వాసులు తమ వాటర్ డ్రమ్‌లకు తాళాలు వేసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీళ్లు దొరికినప్పుడే డ్రమ్ములు నింపుకుని నిల్వ చేసుకుంటున్నారు. నీటి కోసం ఆజ్మీర్‌ పరిసర ప్రాంతాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా విశాల్‌ నగర్ వాసి ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... తమకు తాగు నీరు ప్రతిరోజు రావడం లేదని, వచ్చినప్పుడే ఇలా నిల్వ చేసుకుని పెట్టుకుంటున్నామని, నీళ్లను కూడా కొందరు చోరీ చేస్తుండడంతో తాళాలు వేస్తున్నామని అన్నారు. ఎండా కాలంలో రాజస్థాన్‌లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం మామూలే. అయితే, ఈసారి ఈ సమస్య మరింత పెరిగిపోయింది.

water
Ajmer
Rajasthan
  • Error fetching data: Network response was not ok

More Telugu News