nagachaitanya: అంచనాలు పెంచేస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు'

- 'శైలజా రెడ్డి అల్లుడు'గా చైతూ
- ఆయన సరసన అనూ ఇమ్మాన్యుయేల్
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
నాగచైతన్య ఒక వైపున 'సవ్యసాచి' సినిమాను పూర్తి చేస్తూనే .. మరో వైపున మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను .. రెండు పాటలను చిత్రీకరించారు. ఈ రెండు పాటలకి కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. తెలుగు రాష్ట్రాలు కాకుండా .. రెస్ట్ ఆఫ్ ఇండియా .. శాటిలైట్ .. డిజిటల్ హక్కులు కలుపుకుని నిర్మాతకి 14 కోట్ల వరకూ ముట్టినట్టుగా సమాచారం.
