arun jaitley: తిరిగి ఇంటికి చేరుకున్నందుకు ఆనందంగా ఉంది: జైట్లీ

  • సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు
  • శ్రేయోభిలాషులు, సహచరులకు ధన్యవాదాలు
  • ఈ నెలాఖరుకు తిరిగి మంత్రి బాధ్యతల్లోకి?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మూడు వారాల చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీలోని  ఎయిమ్స్ లో ఆయన మూత్ర పిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా జైట్లీ ఓ ట్వీట్ చేశారు.

‘‘తిరిగి ఇంటికి చేరుకున్నందుకు ఆనందంగా ఉంది. గత మూడు వారాలుగా నా ఆరోగ్యం కోసం శ్రమించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి నా కృతజ్ఞతలు. నా గురించి ఆందోళన చెందిన వారికి, నేను త్వరగా కోలుకోవాలని ఆశించిన శ్రేయోభిలాషులు, సహచరులు, స్నేహితులకు ధన్యవాదాలు’’ అంటూ జైట్లీ ట్వీట్ చేశారు.

కాగా, అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ఆ శాఖ బాధ్యతలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు ప్రధాని అప్పజెప్పిన సంగతి విదితమే. ఇక తాను కోలుకోవడంతో ఈ నెలాఖరుకి తిరిగి జైట్లీ తన మంత్రిత్వ శాఖ విధులను నిర్వర్తిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News