karthi: 'నువ్ రైతువైతే కాలర్ ఎగరేసుకుని తిరుగంతే' .. 'చినబాబు'గా అదరగొట్టేస్తోన్న కార్తీ

- పాండిరాజ్ దర్శకత్వంలో 'చినబాబు'
- రైతు వేషధారణలో కార్తీ
- తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో 'కడైకుట్టి సింగం' చిత్రం రూపొందింది. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'చినబాబు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పంటలు .. పచ్చదనం .. ప్రేమలు .. ఆప్యాయతలతో కూడిన గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందనే విషయం ఈ టీజర్ వలన అర్థమవుతోంది.
