alla: ఏసీబీ విచారణకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

  • బినామీ ఆస్తుల కేసులో ఏసీబీ విచారణకు హాజరు
  • అనారోగ్య కారణాలతో గత రెండు విచారణలకు గైర్హాజరు
  • డీఎస్పీ దుర్గాప్రసాద్ అక్రమాస్తుల్లో ఆర్కే కుటుంబసభ్యుల పేర్లు

బినామీ ఆస్తుల కేసులో ఏసీబీ విచారణకు వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హాజరయ్యారు. అనారోగ్య కారణాలతో గత రెండు విచారణలకు ఆయన హాజరుకాలేకపోయారు. దీంతో, ఈరోజు విచారణకు హాజరుకావల్సిందిగా గత విచారణ సమయంలో ఆర్కేను ఏసీబీ ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్ ఏసీబీకి ఇటీవల పట్టుబడ్డారు. ఆయనకు చెందిన అక్రమాస్తుల్లో ఆర్కే కుటుంబసభ్యుల పేర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆర్కేకు నోటీసులు పంపారు.

alla
ramakrishna reddy
acb
dsp durgaprasad
  • Loading...

More Telugu News