venkatesh: గ్రామీణ నేపథ్యంలో 'వెంకీ మామా' .. దర్శకుడిగా బాబీ!

- మల్టీ స్టారర్ కి బాబీ సన్నాహాలు
- వెంకీ సరసన హ్యూమా ఖురేషి
- చైతూ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్
'జై లవ కుశ' హిట్ తరువాత కొంత సమయం తీసుకుని దర్శకుడు బాబీ మంచి ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ మల్టీ స్టారర్ మూవీ కోసం వెంకటేశ్ .. నాగచైతన్యలను హీరోలుగా ఎంచుకున్నాడు. ఈ ఇద్దరూ బయట మేనమామ .. మేనల్లుడు అనే సంగతి తెలిసిందే. బాబీ సినిమాలోనూ ఈ ఇద్దరూ మేనమామ .. మేనల్లుడు పాత్రలనే పోషించనుండటం విశేషం.
