JDS: కుమారస్వామి కోసం అభిమాని ప్రతిజ్ఞ... ఎట్టకేలకు కాశీ వెళ్లి తలనీలాలు ఇచ్చాడు!

- తల వెంట్రుకలు తీయబోనని ప్రతిజ్ఞ
- 2007లో ప్రమాణం చేసిన ఆర్కే గౌడ
- ఇప్పుడు కాశీకి వెళ్లి మొక్కు తీర్చిన వైనం
జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకూ, తల వెంట్రుకలు, మీసం, గడ్డాలు తొలగించబోనని 11 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేసిన ఓ వ్యక్తి, ఇప్పుడు కాశీ వెళ్లి మొక్కు తీర్చుకుని వచ్చాడు. మైసూరు జిల్లా కేఆర్ నగర్ తాలూకా మేలూరు గ్రామానికి చెందిన రామక్రిష్ణ గౌడ, 2007లో కుమారస్వామి సీఎంగా తప్పుకున్న తరువాత, తిరిగి ఆయన సీఎం అయ్యేంత వరకూ శిరోముండనం చేయించుకోబోనని దీక్షబూనాడు.
