bobby deol: నన్ను చూసి నాకే జాలి వేసేది.. నా ఆరోగ్యం గురించి ఆలోచించడం కూడా మానేశా!: బాబీ డియోల్

  • ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి
  • అన్నీ కోల్పోయినట్టు అనిపించేది
  • 'రేస్-3'లో సల్మాన్ అవకాశం ఇచ్చాడు

బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా వెలుగొందిన ధర్మేంద్ర కుమారుడు, హీరో బాబీ డియోల్ తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించానని చెప్పాడు. ఒకానొక సమయంలో తనకు సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయని, దీంతో ఎంతో మనోవేదనకు గురయ్యానని, అన్నీ కోల్పోయినట్టు అనిపించేదని చెప్పాడు.

దీంతో తాగుడుకి బానిసనయ్యానని, శరీరం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కూడా మానేశానని తెలిపాడు. తనను చూస్తే తనకే జాలి వేసేదని చెప్పాడు. అయితే తన ఇద్దరు కుమారుల కోసం తనను తాను మార్చుకున్నానని అన్నాడు. అదే సమయంలో 'పోస్టర్ బోయ్స్' సినిమాలో అవకాశం వచ్చిందని... ఆ సినిమా అంతగా ఆడకపోయినా, తన నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయని.. దీంతో తన ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు సల్మాన్ ఖాన్ ను కలవడం జరిగిందని... అప్పటి నుంచి 'రేస్-3' సినిమా గురించి తాము చర్చించడం మొదలెట్టామని బాబీ తెలిపాడు. ఓ రోజు సల్మాన్ తనతో మాట్లాడుతూ, 'నా కెరీర్ బాగోలేనప్పుడు సంజయ్ దత్, నీ అన్న సన్నీడియోల్ ల వెంట తిరిగేవాడిని' అని చెప్పాడని... దీంతో, 'మామూ... నన్ను కూడా నీవెంట పడనివ్వు' అని అడిగేశానని చెప్పాడు.

దానికి సమాధానంగా 'చొక్కా విప్పుతావా?' అని సల్లూ అడిగాడని... సినిమా కోసం ఏం చేయడానికైనా రెడీనే అని తాను చెప్పానని తెలిపాడు. ఆ తర్వాత తనకు 'రేస్-3'లో సల్మాన్ అవకాశం ఇచ్చాడని చెప్పాడు. ఇప్పుడిప్పుడే తనకు మళ్లీ నమ్మకం పెరుగుతోందని అన్నాడు. నటుడుగా తనను తాను నిరూపించుకుంటానని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. మరోవైపు 'హౌస్ ఫుల్ 4', 'యమ్లా పగ్లా దివానా ఫిర్ సే' అనే సినిమాల్లో కూడా బాబీ డియోల్ నటించబోతున్నాడు. 

bobby deol
salman khan
race 3
bollywood
struggle
  • Loading...

More Telugu News