Big Boss: వచ్చే మూడున్నర నెలలూ మీతో పాటు, మీ ఇంట్లోనే ఉండబోతున్నా: హీరో నాని

  • బిగ్ బాస్ రెండో సీజన్ కు యాంకర్ గా వ్యవహరించనున్న నాని
  • ప్రమోషనల్ కార్యక్రమంలో మాట్లాడిన నేచురల్ స్టార్
  • యాంకర్ గా తొలి ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని వినతి

వచ్చే మూడున్నర నెలల కాలం పాటు తాను తెలుగువారి ఇళ్లలో తెలుగు ప్రేక్షకులతో కలిసుంటానని హీరో నాని వ్యాఖ్యానించాడు. మరో వారం రోజుల్లో... అంటే 10వ తేదీ నుంచి 100 రోజుల పాటు సాగనున్న టాలీవుడ్ బిగ్ బాస్-2 రియాల్టీ షో కోసం జరిగిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో నాని మాట్లాడాడు.

 ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఉన్న తాను మీ ఇంట్లో, మీ కుటుంబీకుడిగా ఉండనున్నానని, యాంకర్ గా తన తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరాడు. ఎన్ని సినిమాలు చేసినా తనకు చాలడం లేదని, తన దాహాన్ని బిగ్ బాస్ తీరుస్తుందనే నమ్ముతున్నానని చెప్పాడు. సినిమా షూటింగ్ కన్నా, బిగ్ బాస్ నిర్వాహకులు మరింత ఆర్గనైజ్డ్ గా ఉన్నారని చెప్పాడు.

ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయగలనని తనను బిగ్ బాస్ నిర్వాహకులు నమ్మించారని, ఆ నమ్మకంతోనే ఒప్పుకున్నానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో అలోక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ఈ షో స్టార్ మా టీవీ చానల్ లో ప్రసారం అవుతుందన్న సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News