ntr: రంగంలోకి దిగిన ఎన్టీఆర్ .. నాన్ స్టాప్ గా షూటింగ్

  • షూటింగు దశలో ఎన్టీఆర్ మూవీ 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • ఎన్టీఆర్ న్యూ లుక్ ప్రత్యేక ఆకర్షణ 

త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూటింగును పూర్తి చేసుకుంది. ఈ రోజు నుంచి ఈ సినిమా మూడవ షెడ్యూల్ మొదలైంది. మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ నెలంతా ఈ షెడ్యూల్ షూటింగ్ కొనసాగనుంది.

ఎన్టీఆర్ తో పాటు ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో తెరకెక్కించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ కావడం .. ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడటం .. సిక్స్ ప్యాక్ తో కూడిన ఆయన న్యూ లుక్ .. తమన్ సంగీతం .. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందనేది ఆయన అభిమానుల మాట.       

  • Loading...

More Telugu News