Jammu And Kashmir: ఉత్తర, దక్షిణ కొరియాలు కలిసిపోయాయి.. భారత్‌, పాక్‌ మధ్య మాత్రం కాల్పులు జరుగుతున్నాయి: మెహబూబా ముఫ్తీ

  • కాల్పుల వల్ల భారత్‌, పాక్‌ ప్రజలు మృతి 
  • ఇరు దేశాలు స్నేహపూరితంగా ఉండేవరకు మార్పు రాదు
  • చర్చలు జరపాలని కోరుకుంటున్నాం

ఎన్నో ఏళ్లుగా ఉన్న గొడవలని పక్కన పెట్టి ఉత్తర, దక్షిణ కొరియాలు కలిసిపోయాయని, కానీ భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దుల్లో మాత్రం ఇప్పటికీ కాల్పులు జరుగుతున్నాయని జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు.

 తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... కాల్పుల వల్ల భారత్‌, పాక్‌ ప్రజలు మృతి చెందుతున్నారని, ఇరు దేశాలు స్నేహపూరితంగా ఉండేవరకు మార్పు రాదని అన్నారు. తమ రాష్ట్ర పరిస్థితిని చూస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలుస్తుందని అన్నారు. అందుకే తాము చర్చలు జరపాలని కోరుకుంటున్నామని, భారత్‌, పాక్‌ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య భేటీ జరిగినప్పటికీ కాల్పులు జరుగుతుండడం దురదృష్టకరమని అన్నారు.

  • Loading...

More Telugu News