Hyderabad: హైదరాబాద్‌లోని షాపింగ్ మాల్స్‌లో.. ఒక్క కూల్ డ్రింక్ రూ.250, వాటర్ బాటిల్ రూ.80.. కేసులు నమోదు
- తూనికలు కొలతల శాఖ అధికారుల తనిఖీలు
- ఏషియన్ జీవీఆర్, మీరాజ్ థియేటర్లపై కేసులు
- పలు షాపింగ్ మాల్స్‌లో మోసాలు
ఒక్కో కూల్ డ్రింక్ దాదాపు రూ.250... వాటర్ బాటిల్ కొనుక్కుని తాగాలంటే రూ.80 చెల్లించాల్సిందే.. ఏ తిను బండారం కొనుక్కోవాలన్నా పెద్ద మొత్తంలో సమర్పించుకోవాల్సిందే. హైదరాబాద్‌లోని పలు షాపింగ్ మాల్స్, థియేటర్లకు వెళ్లే వారు ఎదుర్కొనే పరిస్థితి ఇది. పెద్ద కంపెనీల లేబుల్స్ వేసి, నకిలీ సరుకు కూడా అమ్మేస్తున్నారు.
ఈ విషయంపై సమాచారం అందుకున్న తూనికలు కొలతల శాఖ అధికారులు ఈరోజు ప్రసాద్ ఐమ్యాక్స్, జీవీకే మాల్, పీవీఆర్ సెంట్రల్, ఇన్ఆర్బిట్ మాల్, పీవీఆర్ కాంప్లెక్స్, మీరజ్ షాపింగ్ మాల్స్, లియెనియో కార్నివాల్ తో పాటు పలు షాపింగ్ మాల్స్‌లో సోదాలు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని ఏషియన్ జీవీఆర్, కొత్త పేటలోని మీరాజ్ థియేటర్‌తో పాటు పలు మాల్స్‌పై కేసు నమోదు చేశారు.