shikhar dhavan: అందుకే కబడ్డీ ఆటగాళ్లలా తొడగొడతాను: శిఖర్‌ ధావన్‌

  • షేన్‌ వాట్సన్‌ క్యాచ్‌ పట్టినప్పటి నుంచి కొడుతున్నాను
  • కబడ్డీ స్టైల్‌లో తొడగొట్టడం నా హృదయంలోంచి వచ్చే పోజ్‌  
  • కబడ్డీ ఆటను చూడడాన్ని ఎంజాయ్‌ చేస్తాను
  • నాకు చాలా వినోదాన్నిస్తుంది

టీమిండియా ఆటగాడు శిఖర్‌ ధావన్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు ఎవరి క్యాచ్‌నయినా పడితే వెంటనే తొడ కొడతాడన్న విషయం తెలిసిందే. అలా ఎందుకు చేస్తానన్న విషయం గురించి ధావన్‌ స్వయంగా వివరించి చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... గతంలో తాను ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు షేన్‌ వాట్సన్‌ క్యాచ్‌ పట్టినప్పటి నుంచి ఇలా కబడ్డీ స్టైల్‌లో తొడగొట్టడం మొదలు పెట్టానని అన్నాడు.

కబడ్డీ ఆటను చూడడాన్ని తాను చాలా ఎంజాయ్‌ చేస్తానని, అది తనకు చాలా వినోదాన్నిస్తుందని చెప్పాడు. తొడగొట్టడం అనేది తన హృదయంలోంచి వచ్చే పోజ్‌ అని, అందుకే అభిమానులు కూడా దాన్ని ఇష్టపడతారని అన్నాడు. తాను బౌండరీల వద్ద నిలబడి ఉన్నప్పుడు అభిమానులు కబడ్డీ స్టైల్‌ పోజ్‌ ఇవ్వాలని అడుగుతుంటారని తెలిపాడు.

shikhar dhavan
Cricket
  • Loading...

More Telugu News