jagan: జగన్ ఉండాల్సింది జనాల్లో కాదు.. మెంటల్ హాస్పిటల్లో: ఎమ్మెల్యే రామానాయుడు

  • తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచేశారు
  • ఆయన అనుచరులు గుళ్లను, గోపురాలను మింగేశారు
  • పాలకొల్లులో పోటీ చేస్తే జగన్ కు డిపాజిట్ కూడా రాదు

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచేసిన ఘనత వైసీపీ అధినేత జగన్ దని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కానీ, తనను కానీ విమర్శించే అర్హత జగన్ కు లేదని అన్నారు. జగన్ ఉండాల్సింది జనాల మధ్య కాదని, మెంటల్ హాస్పిటల్ లో అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాత్రిపగలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నామని, లోటు బడ్జెట్ లో సైతం అభివృద్ధిపథంలోకి తీసుకెళుతున్నామని చెప్పారు. జగన్ రాష్ట్రాన్ని దోచేస్తే, ఆయన అనుచరులు గుళ్లను, గోపురాలను దోచేశారని విమర్శించారు. పాలకొల్లులో జగన్ పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని... డిపాజిట్ దక్కితే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సవాల్ విసిరారు.

jagan
Chandrababu
nimmala ramanaidu
  • Loading...

More Telugu News