swetha basu prasad: పెళ్లిపీటలు ఎక్కబోతున్న శ్వేతాబసు.. బాలీవుడ్ దర్శకుడితో పెళ్లి!

  • బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ తో శ్వేతాబసు పెళ్లి 
  • నిశ్చితార్థం అయిపోయిందంటూ ప్రకటన 
  • రోహిత్ కు తానే ప్రపోజ్ చేశానన్న నటి

గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ ను ఆమె వివాహం చేసుకోనుంది. కొన్ని రోజుల క్రితమే తమ నిశ్చితార్థం జరిగినట్టు శ్వేత స్వయంగా ప్రకటించింది. గోవాలో రోహిత్ కు తానే ప్రపోజ్ చేశానని, ఆ తర్వాత పూణెలో తన ప్రేమను రోహిత్ అంగీకరించాడని తెలిపింది. ఇంట్లోవాళ్లు కూడా తమ ప్రేమను అంగీకరించారని చెప్పింది.

అయితే, తమ ఇద్దరి జీవితాలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చెప్పుకోవాలని తాము భావించడం లేదని తెలిపింది. పెళ్లి ప్రస్తావనను అబ్బాయిలు మాత్రమే తెచ్చే రోజులు పోయాయని, ఇప్పుడు అమ్మాయిలు కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం శ్వేత ఓ బాలీవుడ్ చిత్రంతో పాటు తెలుగులో 'గ్యాంగ్ స్టర్స్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

swetha basu prasad
rohit mittal
love
marriage
bollywood
tollywood
  • Loading...

More Telugu News