Chandrababu: చంద్రబాబు చేతిలో నటుడు శివాజీ కీలుబొమ్మ: మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

  • గతంలో శివాజీ నోటి నుంచి 'ఆపరేషన్ గరుడ' వ్యాఖ్యలు
  • అవి నిజమేననిపిస్తోందని చంద్రబాబు తాజా వ్యాఖ్యలు
  • శివాజీతో చెప్పించింది చంద్రబాబేనంటున్న ఐవైఆర్

నటుడు శివాజీ నోటి నుంచి వచ్చిన 'ఆపరేషన్ గరుడ' వ్యాఖ్యలకు చంద్రబాబునాయుడే నిర్మాత, దర్శకుడు, రచయితని మాజీ చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను రాసుకున్న స్క్రిప్టును శివాజీ అనే నటుడిని ఎంచుకుని, అతనితో చెప్పించిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.

ఆపై ఇప్పుడు 'ఆపరేషన్ గరుడ' నిజం కావచ్చని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు ఏం ఐడియా వేశారోనని అన్నారు. ఏ కారణాలతో 'ఆపరేషన్ గరుడ' నిజమవుతుందని చంద్రబాబు అంటున్నారో సమాధానం చెప్పాలని ఐవైఆర్ డిమాండ్ చేశారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం 'ఆపరేషన్ గరుడ' ప్రారంభించిందని, ఇందులో భాగంగా ఒక్కో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నది మోదీ, అమిత్ షాల ప్లాన్ అని శివాజీ విమర్శించిన సంగతి తెలిసిందే.

Chandrababu
Sivaji
IYR
Operation Garuda
BJP
  • Loading...

More Telugu News