bipasha basu: బాలీవుడ్ హీరోయిన్ బిపాసాబసుకు అస్వస్థత.. ముంబై ఆసుపత్రిలో చికిత్స

  • శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న బిపాసా
  • ఇప్పటికే పలుమార్లు ఆసుపత్రికి వెళ్లిన నటి
  • మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే చికిత్స

బాలీవుడ్ నటి బిపాసాబసు అస్వస్థతకు గురైంది. గత కొంత కాలంగా ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను ముంబైలోని ఓ ఆసుపత్రికి ఆమె కుటుంబీకులు తరలించారు. ఈ సమస్య కారణంగా బిపాసా ఇప్పటికే పలుమార్లు ఆసుపత్రికి వెళ్లిందట. సమస్య మరింత తీవ్రంగా మారడంతో, ఆమెను మళ్లీ ఆసుపత్రిలో చేర్చారు. ముంబైకి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండి ఆమె చికిత్స తీసుకోనున్నట్టు బీటౌన్ సమాచారం. ఇటీవలే బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను ఆమె పెళ్లాడింది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కబోతోంది.

bipasha basu
illness
health
hospital
treatment
bollywood
  • Loading...

More Telugu News