Andhra Pradesh: పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం!

  • ఏపీ అభివృద్ధికి పునరంకితం కావాలంటే నవ నిర్మాణ దీక్షలు
  • తొలి రోజు పాల్గొనని వారిపై చంద్రబాబు ఆగ్రహం
  • మరోసారి ఇలా జరిగితే చర్యలుంటాయని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపిస్తూ, రాష్ట్ర విభజన తరువాత అభివృద్ధికి పునరంకితం కావాలనేలా నవ నిర్మాణ దీక్షలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడితే, ఆ కార్యక్రమానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఉదయం అమరావతిలో టీడీపీ నేతలు, సమన్వయకర్తలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, తొలి రోజు నవనిర్మాణ దీక్షలో పాల్గొనని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు ఇలా జరిగితే చర్యలుంటాయని, ప్రతి ఒక్కరూ నిత్యమూ జరిగే నవ నిర్మాణ దీక్షల్లో పాల్గొని కేంద్రం చేసిన అన్యాయాన్ని గురించి ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. ఈ దీక్షల్లో ప్రతి తెలుగుదేశం నేతా పాల్గొనాల్సిందేనని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు.

Andhra Pradesh
Chandrababu
Navanirmana Deeksha
  • Loading...

More Telugu News