Nipha: కలకలం... తిరుపతికి పాకిన నిపా వైరస్?

  • కేరళ నుంచి వచ్చిన వైద్యురాలికి లక్షణాలు
  • రూయా ఆసుపత్రిలో చికిత్స
  • కేరళలో వైరస్ కారణంగా 16 మంది మృతి

కేరళలో మొదలై, ఆపై కర్ణాటకలో కలకలం రేపిన ప్రాణాంతక నిపా వైరస్, తిరుపతికి తాకింది. కేరళ నుంచి వచ్చిన ఓ మహిళా డాక్టర్ కు నిపా లక్షణాలు కనిపించాయి. ఆమెకు ప్రస్తుతం రూయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు.

కాగా, కేరళలో నిపా వైరస్ కారణంగా ఇంతవరకూ 16 మంది మరణించినట్టు అధికారిక సమాచారం. తొలుత గబ్బిలాలు, పందుల కారణంగా ఈ వైరస్ వ్యాపిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించినప్పటికీ, ఆపై వైరస్ వ్యాప్తికి అదొక్కటే కారణం కాదని, కలుషిత నీరు కూడా కారణమవుతోందని తేల్చారు. జ్వరం, తలనొప్పి, విరోచనాలు వంటి సమస్యలతో బాధపడుతూ ఐదారు రోజులైనా తగ్గకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Nipha
Tirupati
Kerala
Virus
  • Loading...

More Telugu News