polavaram: పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపేయమనండి: కేంద్ర మంత్రికి ఒడిశా సీఎం లేఖ

  • ఒక్కసారిగా అభ్యంతరాలు తెలిపిన వైనం
  • కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు లేఖ 
  • ముంపు, పునరావాసం తేలేవరకు పనులు జరపవద్దు 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపివేసేలా చూడాలని కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్‌కు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ లేఖ రాశారు. ముంపు, పునరావాసం అంశాలు తేలేవరకు పనులను కొనసాగించవద్దని ఆయన లేఖలో కోరారు. పోలవరం నిర్మాణం వల్ల ఒడిశా ఎదుర్కుంటోన్న సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని, ప్రాజెక్టు పూర్తయితే ఒడిశా వాసులు శాశ్వతంగా నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రెండు సార్లు లేఖలు రాశామని చెప్పారు.                    

polavaram
naveen patnaik
letter
  • Loading...

More Telugu News