vijay: హీరో విజయ్ పుట్టినరోజున ప్లాన్ చేసిన మురుగదాస్

- మురుగదాస్ దర్శకత్వంలో విజయ్
- కథానాయికగా కీర్తి సురేశ్
- తమిళ .. తెలుగు భాషల్లో దీపావళికి విడుదల
తమిళనాట మాస్ ఆడియన్స్ లో విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రం మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు .. ఫస్టులుక్ వదల్లేదు.
