donald trump: ట్రంప్ తో కిమ్ జాంగ్ భేటీకి తేదీ ఖరారు

  • జూన్ 12న సింగపూర్ లో సమావేశం
  • స్వయంగా వెల్లడించిన ట్రంప్
  • ఇరు దేశాల మధ్య అనుబంధం పెరగడం సంతోషకరమన్న యూఎస్ అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ల భేటీకి తేదీ ఖరారయింది. జూన్ 12వ తేదీన సింగపూర్ లో తమ సమావేశం కొనసాగనుందని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. వైట్ హౌస్ లో ఉత్తర కొరియా రాయబారి కిమ్ యోంగ్ చోల్ తో దాదాపు 80 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ఈ తేదీని ఖరారు చేశారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ పంపిన లేఖను ట్రంప్ కు కిమ్ యోంగ్ చోల్ అందించారు.

కొరియాను అణు రహిత దేశంగా మార్చాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ట్రంప్, కిమ్ ల భేటీ జరగనుంది. అయితే అణురహిత దేశంగా కొరియాను మార్చడమన్నది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని ట్రంప్ అన్నారు. ఇది ఒక్క సమావేశంతోనే అయిపోయేది కాదని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరగడం మంచి పరిణామమని అన్నారు. ఉత్తర కొరియా అభివృద్ధి చెందాలని భావిస్తోందని, వారు ఆశిస్తున్నది జరుగుతుందని తెలిపారు. కిమ్ జాంగ్ తో తన సమావేశం ఫలప్రదం అవుతుందని చెప్పారు. 

donald trump
kim jong un
meeting
date
singapore
  • Loading...

More Telugu News