rana: కంటినొప్పితో బాధపడుతున్న రానా.. త్వరలోనే ఆపరేషన్!

  • ఒక కన్ను సరిగా కనిపించదని ఇటీవలే చెప్పిన రానా
  • ఆపరేషన్ కు సరైన డేట్ కోసం ఎదురు చూస్తున్నామన్న సురేష్ బాబు
  • విదేశాల్లో సర్జరీ కోసం ఏర్పాటు

విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ, సక్సెస్ ఫుల్ గా సినీ కెరీర్ ను కొనసాగిస్తున్న రానా కంటి ఆపరేషన్ కు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఆయన కుడి కంటికి ఆపరేషన్ జరగబోతోంది. చాలా కాలంగా కంటి నొప్పితో రానా బాధ పడుతున్నాడు. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో ఇటీవల రానా మాట్లాడుతూ, తన కన్ను ఒకటి సరిగా కనిపించదని చెప్పాడు. తాజాగా రానా తండ్రి సురేష్ బాబు ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రానా ఆపరేషన్ కు సరైన డేట్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఆ సర్జరీ ఇండియాలో జరగదని తెలిపారు. ప్రస్తుతం రానా మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. 

rana
eye
operation
tollywood
suresh babu
  • Loading...

More Telugu News