Atlanta: హుషారుగా స్టెప్పులేస్తూ ఆపరేషన్... కోరి కష్టాలు కొనితెచ్చుకున్న మహిళా డాక్టర్... వీడియో!

  • డ్యాన్స్ చేస్తూ ఆపరేషన్ చేసిన అట్లాంటా వైద్యురాలు
  • ఆపై వీడియో తీసి యూట్యూబ్ లో పోస్టు
  • కఠిన చర్యలకు సిద్ధమైన వైద్య బోర్డు

శస్త్రచికిత్స చేసే ముందు రోగికి కాస్తంత మనోధైర్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో విభిన్నంగా ప్రవర్తించిన ఓ మహిళా డాక్టర్ చిక్కుల్లో పడింది. రోగికి మత్తుమందు ఇచ్చిన తరువాత, ఆమె మెల్లిగా స్పృహ కోల్పోతుండగా, డాక్టర్ విండేల్ బోట్టే డ్యాన్స్ చేస్తూ ఆపరేషన్ చేసింది. డ్యాన్స్ చేస్తూనే రోగి శరీరానికి కోతపెట్టింది. శరీరంలో కత్తిని అలానే ఉంచి స్టెప్పులేసింది. ఆమెతో పాటు ఆపరేషన్ థియేటర్ లోని వారంతా డ్యాన్స్ చేశారు. అక్కడే ఉన్న ఓ నర్సు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీయగా, అదేదో ఘనకార్యం అయినట్టు, యూట్యూబ్ లో పోస్టు చేసింది.

 అట్లాంటా ఏరియా బోర్టు నుంచి డెర్మటాలజిస్టుగా ధ్రువీకరణ పొందిన ఆమెపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. గతంలో నాలుగుసార్లు ఆమె ఇలాగే డ్యాన్స్ చేస్తూ ఆపరేషన్లు చేశారని, ఆమెపై నాలుగు కేసులు విచారణ దశలో ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇక ఆమె శస్త్రచికిత్స సమయంలో పాటించాల్సిన కనీస నియమాలను పాటించలేదని అట్లాంటా హెల్త్ బోర్డు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోను మీరు కూడా చూడొచ్చు.

Atlanta
Doctor
Operation
Dance
  • Error fetching data: Network response was not ok

More Telugu News