Tanikella Bharani: ఉత్తేజ్ కుమార్తెను చూసి ఆనందబాష్పాలు రాల్చాను: తనికెళ్ల భరణి

  • రవీంద్ర భారతిలో చేతన ఉత్తేజ్ ప్రదర్శన
  • 'అష్టవిధనాయిక'ను ప్రదర్శించిన చేతన
  • పొగడ్తలతో ముంచెత్తిన తనికెళ్ల

రవీంద్ర భారతి వేదికగా, నటుడు ఉత్తేజ్ కుమార్తె చేతన 'అష్టవిధనాయిక' కాన్సెప్ట్ తో భరతముని నాట్య శాస్త్రంలోని ఎనిమిది రకాల నాయికల మనస్తత్వాన్ని అభినయిస్తూ చేసిన ప్రదర్శనపై సినీ నటుడు తనికెళ్ల భరణి ప్రశంసల వర్షం కురిపించారు. చాలా సంవత్సరాల తరువాత ఇటువంటి ప్రదర్శన చూశానని, తన గుండె నిండిపోయిందని, కళ్ల వెంబడి ఆనందబాష్పాలు వచ్చాయని చెప్పారు.

చేతన ప్రదర్శన చూసిన తరువాత నోట మాట రాలేదన్నారు. అత్యాచారాల‌ను క‌థా వ‌స్తువుగా చేసుకుని ఉత్తేజ్ స్వయంగా ర‌చించిన ‘అనంత‌’ రూపకాన్ని చేత‌న సోలోగా ప్ర‌ద‌ర్శించగా, ఆ కార్యక్రమంపైనా భరణి పొగడ్తలు కురిపించారు. సాత్విక అభినయం ప్రధానంగా ఓ రూపకాన్ని మాటలు లేకుండా రక్తి కట్టించడం గొప్ప విషయమని చేతన ప్రదర్శనను తిలకించిన తెలంగాణ రాష్ట్ర స‌ల‌హాదారు కేవీ ర‌మణాచారి వ్యాఖ్యానించారు.

Tanikella Bharani
Chetana Uttej
Ravindra Bharati
Hyderabad
  • Loading...

More Telugu News