Telangana: ఘోర ప్రమాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం!

  • కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
  • రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైన వాహనదారులు
  • రాజీవ్ రహదారిపై ఘటన

ప్రజ్ఞాపూర్‌ సమీపంలోని రాజీవ్ రహదారిపై రిమ్మనగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట వైపు వెళ్తున్న కారులో రిమ్మనగూడ పెట్రోలు బంకు దాటగానే మంటలు చెలరేగాయి. గమనించిన తోటి వాహనదారులు కారు అద్దాలు పగలగొట్టి లోపలున్న వ్యక్తిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

మంటలు క్షణాల్లోనే కారంతా వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి అందరూ చూస్తుండగానే సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక, పెట్రోలు లీకేజీ కారణమా? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana
Hyderabad
Car accident
  • Loading...

More Telugu News