pejawar mutt: మోదీ పూర్తిగా విఫలమయ్యారు: ఉడుపి పెజావర పీఠాధిపతి

  • నల్లధనం హామీని నిలబెట్టుకోలేకపోయారు
  • ప్రజల్లో విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు
  • కుమారస్వామి మంచి నేత

దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధానిగా నరేంద్రమోదీ పూర్తిగా విఫలమయ్యారని కర్ణాటకలోని ఉడుపి పెజావర పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామీజీ అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా ఇచ్చిన హామీ ప్రకారం నల్ల ధనాన్ని వెనక్కి తీసుకురాలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాటలపై ప్రజలకు విశ్వాసం ఉండేదని, కానీ దానిని ఆయన పోగొట్టుకున్నారని అన్నారు.

తనకు ఏ పార్టీపైనా సదభిప్రాయం లేదన్న స్వామీజీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం నల్లధన ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. ఎన్నికల్లోగా నల్లధనాన్ని దేశానికి రప్పిస్తే బాగుంటుందని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని స్వామీజీ ప్రశంసించారు. అనుభవం ఉన్న నేత అని, రాష్ట్రాన్ని చక్కగా పాలించగలరని పేర్కొన్నారు.

pejawar mutt
Karnataka
Vishvesha Tirtha Swamiji
Narendra Modi
  • Loading...

More Telugu News