jagapathibabu: నువ్వా? నేనా? అంటున్న 'ఆటగాళ్లు' .. రిలీజ్ డేట్ ఖరారు!

  • పరుచూరి మురళి దర్శకత్వంలో 'ఆటగాళ్లు'
  • హీరోలుగా జగపతి .. నారా రోహిత్
  • జూలై 5వ తేదీన భారీ రిలీజ్

జగపతిబాబు .. నారా రోహిత్ ప్రధాన పాత్రలుగా పరుచూరి మురళి దర్శకత్వంలో 'ఆటగాళ్లు' సినిమా రూపొందింది. 'గేమ్ ఆఫ్ లైఫ్' అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. బెంగాలి మోడల్ 'దర్శన బానిక్' ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. తెలుగులో ఆమె చేసిన తొలి సినిమా ఇదే. ఇక బ్రహ్మానందం ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

ఇటీవలే షూటింగును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. జగపతిబాబు .. నారా రోహిత్ పాత్రలు నువ్వా? నేనా? అన్నట్టుగా ఉంటాయట. ఇటు జగపతిబాబు .. అటు నారా రోహిత్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని పరుచూరి మురళి అంటున్నారు. ఇక దర్శన బానిక్ కూడా ఈ సినిమా తనకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందనే ఆశతో వుంది.     

  • Error fetching data: Network response was not ok

More Telugu News