Congress: మంత్రివర్గ కూర్పుపై రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడింది: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • మంత్రి పదవుల కేటాయింపులపై చర్చించాం
  • తలెత్తిన సమస్యలను పరిష్కరించుకున్నాం
  • రాహుల్‌ గాంధీ చాలా చొరవ చూపారు

కర్ణాటకలో మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు చర్చోపచర్చలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈరోజు జేడీఎస్‌ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల కేటాయింపుల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకున్నామని, కేబినెట్‌ కూర్పుపై రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడిందని తెలిపారు.

ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చాలా చొరవ చూపారని కుమారస్వామి అన్నారు. కాగా, కీలక పదవులయిన హోం శాఖను కాంగ్రెస్‌కు, ఆర్థిక శాఖను జేడీఎస్‌కు ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు నిన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

Congress
Karnataka
jds
  • Loading...

More Telugu News