Jammu And Kashmir: బాలుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టిన మౌల్వి.. వీడియో వైరల్

  • మౌల్వి అరెస్ట్‌
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • బారాముల్లాలోని మదర్సాలో ఘటన

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఓ మదర్సాలో ఎనిమిదేళ్ల బాలుడిని తలకిందులుగా వేలాడదీసి కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న బారాముల్లా పోలీసులు మౌల్వి (మదర్సాలో టీచర్‌) ని అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు ముష్‌తా అహ్మద్‌ దర్‌ అని పోలీసులు తెలిపారు. అతడికి మరి కొందరు సహకరించినట్లు తెలుస్తోంది. ఆయనపై ఆర్‌పీసీ, జువైనల్‌ జస్టిస్‌ చట్టం 2013 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.                                               

Jammu And Kashmir
teacher
madarsa
  • Error fetching data: Network response was not ok

More Telugu News