Director Krish: భార్య రమ్యకు విడాకులు ఇవ్వనున్న డైరెక్టర్ క్రిష్!

  • 'గౌతమీపుత్ర శాతకర్ణి' సమయంలో పెళ్లి 
  • విడాకులకు దరఖాస్తు చేసిన క్రిష్, రమ్య
  • పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు

2016, ఆగస్టు 7న తాను దర్శకత్వం వహిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ, విడాకులకు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. వెలగ రమ్య అనే యువతిని పెళ్లి చేసుకున్న ఆయన, రెండేళ్లలోపే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం టాలీవుడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. క్రిష్, రమ్యలు పరస్పర అంగీకారంతోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, క్రిష్ ప్రస్తుతం 'మణికర్ణిక' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  

Director Krish
Ramya
Divorce
Pragya Jaiswal
  • Loading...

More Telugu News