sanjana reddy: 'ఖుషీ' సినిమా 27 సార్లు చూశాను: 'రాజుగాడు' దర్శకురాలు

- 'ఖుషీ'తో సినిమాల పట్ల ఆసక్తి
- 'రౌడీ' సినిమాకి అసిస్టెంట్ గా
- యాడ్ ఫిల్మ్ కి మంచిపేరు
తెలుగులో అతికొద్ది మంది మహిళా దర్శకులు మాత్రమే తమ అభిరుచికి తగిన సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా సంజనా రెడ్డి కూడా చేరిపోయారు. రాజ్ తరుణ్ హీరోగా ఆమె రూపొందించిన 'రాజుగాడు' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తనకి సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడటానికి గల కారణాన్ని వివరించారు.
