Vijayawada: భర్తతో సంబంధం పెట్టుకుందని నడిరోడ్డుపై యువతిపై మహిళ దాడి!

  • విజయవాడలో ఘటన
  • మహిళను నిలువరించి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లిన స్థానికులు
  • తనకు న్యాయం చేయాలంటున్న బాధితురాలు రమాదేవి

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో రమాదేవి అనే మహిళ నడిరోడ్డుపై ఓ యువతిని చావబాదిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లాకు చెందిన సురేష్ కుమార్ నగరంలోని సన్ రైజ్ ఆసుపత్రిలో మేనేజర్ గా పని చేస్తుండగా, 9 సంవత్సరాల క్రితం రమాదేవితో వివాహం అయింది.

గత కొంత కాలంగా రమేష్ తనను పట్టించుకోవడం లేదని, అందుకు మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడమే కారణమని ఆరోపించిన రమాదేవి, ఇదే విషయాన్ని పోలీసులకూ ఫిర్యాదు చేసింది. అయినా భర్త పరిస్థితి మారకపోవడంతో అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి రంగంలోకి దిగింది. గత రాత్రి సురేష్ కుమార్, సదరు యువతి కలిసుండగా పట్టుకుని దాడి చేసింది. స్థానికులు రమాదేవిని నిలువరించి, ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తనకు న్యాయం చేయాలని రమాదేవి కోరుతుండగా, రమాదేవి తనను హత్య చేయాలని చూసిందని, కావాలనే నిందలు వేస్తోందని సురేష్ ఆరోపిస్తున్నాడు.

Vijayawada
Road
Ramadevi
Police
Extra Marital Relation
  • Loading...

More Telugu News