Amaravati: అమరావతి సెక్రటేరియేట్ వద్ద మోసగాడి అరెస్ట్!

  • సచివాలయం వద్ద మకాం వేసే రాజేశ్వరరెడ్డి
  • సీఎం సహాయనిధి నుంచి సాయం కోసం వచ్చే వారే లక్ష్యం
  • అరెస్ట్ చేసిన పోలీసులు

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని సచివాలయం వద్ద మకాం వేసి, అక్కడికి వచ్చే పేదలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న రాజేశ్వరరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం సహాయనిధి నుంచి సాయం కావాలని వచ్చే వారే ఇతని టార్గెట్. ఎవరైనా కష్టాల్లో ఉండి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్కువ డబ్బు ఇప్పిస్తానని చెబుతూ, అందుకు కొంత ఖర్చు అవుతుందని నమ్మబలికి, వారి నుంచి అందినకాడికి దోచుకుంటాడు.

 ఇతని మోసాలపై తమకు సమాచారం అందడంతో నిఘా పెట్టి అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు. సీఎం సహాయనిధి నుంచి సాయం కావాలని భావించే వారు, తమ దరఖాస్తులను సచివాలయం గేటు నంబర్ 2 వద్ద ఉండే కేంద్రంలో ఇవ్వాలని పేర్కొన్నారు. ఎవరైనా మరింత మొత్తాన్ని ఇప్పిస్తామని చెబితే నమ్మరాదని, లంచం అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మోసగాడు రాజేశ్వరరెడ్డిని కోర్టు ముందు హాజరు పరిచామని తెలిపారు.

Amaravati
Secretariate
Fraud
Arrest
Police
  • Loading...

More Telugu News