Bollywood: బాలీవుడ్ హీరో సల్మాన్‌ను కొడితే రూ.2 లక్షలు.. ప్రవీణ్ తొగాడియా అనుచరుడి సంచలన ప్రకటన!

  • సల్మాన్ ‘లవరాత్రి’పై ఆగ్రహావేశాలు
  • హిందువుల మనోభావాలను కించపరిచారని ఆరోపణ
  • అనుమతిస్తే సినిమా హాళ్లు దహనం చేస్తామని హెచ్చరిక

విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా అనుచరుడు, ‘హిందూ హై ఆజ్’ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ సంచలన ప్రకటన చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను కొట్టినవారికి రూ.2 లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సల్మాన్ ‘లవరాత్రి’ పేరుతో సినిమా తీశారని,  ఇది నవరాత్రి పండుగను అవమానించడమేనని ఆయన ఆరోపించారు.

సల్మాన్‌ను బహిరంగంగా కొట్టిన వారికి రూ.2 లక్షలు బహుమానం ఇస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆగ్రాలోని భగవాన్ టాకీస్‌లో ఈ సినిమా పోస్టర్లను దహనం చేశారు. సల్మాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. సెన్సార్ బోర్డు స్పందించి అనుమతి నిరాకరించాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సినిమా విడుదలైతే థియేటర్లను దహనం చేస్తామన్నారు. సల్మాన్ నటించిన ఈ సినిమా అక్టోబరులో విడుదలకు సిద్ధమవుతోంది.

Bollywood
Salman Khan
Loveratri
Pravin Togadia
  • Loading...

More Telugu News