Karnataka: నిర్మాత పరారీకి సహకరించిన కన్నడ హీరోపై కేసు!

  • 'మస్తిగుడి' కన్నడ చిత్రం షూటింగ్ వేళ ప్రమాదంలో ఇద్దరు మృతి
  • నిర్మాతను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తే అడ్డుకున్న హీరో దునియా విజయ్
  • హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు

రెండేళ్ల క్రితం తిప్పగొండనహళ్లి రిజర్వాయర్ వద్ద కన్నడ చిత్రం 'మస్తిగుడి' షూటింగ్ వేళ, విలన్లుగా నటిస్తున్న ఉదయ్, అనిల్ లు హెలికాప్టర్ నుంచి జలాశయంలో దూకే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న వేళ, జరిగిన ప్రమాదంలో వారిద్దరూ దుర్మరణం పాలవ్వగా, సినిమా నిర్మాత సుందరగౌడ, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు పోవడానికి సహకరించాడన్న ఆరోపణలపై హీరో దునియా విజయ్ పై పోలీసు కేసు నమోదైంది.

తావరకెరె హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు రిజిస్టర్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు ఆర్టిస్టులూ మరణించిన తరువాత, నిర్మాత సుందరగౌడను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లిన వేళ, అక్కడికి వచ్చిన విజయ్, పోలీసులను అడ్డుకుని వారితో మాట్లాడుతుండగా, సుందరగౌడ తప్పించుకున్నాడు. విజయ్ పరోక్షంగా సహకరించినందునే ఆయన తప్పించుకున్నాడని హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో, పోలీసుల విధులను అడ్డుకున్నారన్న సెక్షన్ కింద కేసు నమోదైంది.

Karnataka
Mastigudi
Producer
Dhuniya Vijay
  • Loading...

More Telugu News