Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీలో బీజేపీ పరాజయంపై చర్చ

  • దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ బోల్తా
  •  చావు తప్పి కన్ను లొట్టబోయిన వైనం
  • ఫలితాలను చూసి సంబరపడొద్దన్న చంద్రబాబు

గురువారం రాత్రి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించినట్టు తెలుస్తోంది. నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. నాలుగు లోక్‌సభ స్థానాల్లో ఒకటి బీజేపీ గెలుచుకోగా, మరో దానిని మిత్ర పక్షం గెలుచుకుంది. అలాగే, పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్క దాంట్లోనే గెలుపొందింది.

కేబినెట్ భేటీలో కొందరు మంత్రులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలే పునరావృతమవుతాయని మంత్రులు పేర్కొన్నారు. అయితే, తాజా ఫలితాలను చూసి సంబరపడొద్దని, జాగ్రత్తగా ఉండాలని సీఎం వారిని హెచ్చరించారు. మాటలు చెప్పి పనులు చేయకుంటే అంతిమ ఫలితం ఇలానే ఉంటుందని, కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని మంత్రులను చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం.  

  • Loading...

More Telugu News