sharwanand: శర్వానంద్ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్ .. భారీ ఖర్చు!

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ 
  • యాక్షన్ .. ఎమోషన్ లకి ప్రాధాన్యత

ప్రస్తుతం శర్వానంద్ .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. 1994 నేపథ్యంలో కొనసాగుతోన్న ఈ కథలో శర్వానంద్ యంగ్ స్టర్ గానే కాకుండా మధ్యవయసు కలిగిన గ్యాంగ్ స్టర్ గాను కనిపించనున్నాడు.

ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడం కోసం హైదరాబాద్ లోను .. విశాఖలోను భారీ సెట్స్ వేయిస్తున్నారట. హైదరాబాద్ శివారు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ పరిధిలో వేసే సెట్ కోసమే దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నారని సమాచారం. యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో కలిసిన కథగా ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో శర్వానంద్ వున్నాడు.  

sharwanand
kalyani priyadarshan
  • Loading...

More Telugu News