tabassum: పాల్ ఘర్ లో బీజేపీ గెలుపు.. కైరానాలో మాత్రం పరాభవం!

  • రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి తబుస్సమ్ గెలుపు
  • తబస్సుమ్ కు మద్దతు పలికిన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్
  • పాల్ ఘర్ లో బీజేపీ గెలుపు

ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి పరాభవం ఎదురైంది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయి. రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి తబుస్సమ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ మరణంతో కైరానా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ తరపున సింగ్ కుమార్తె మృగాంక సింగ్ పోటీ చేశారు. తబుస్సమ్ కు బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీలు మద్దతు ఇచ్చాయి.

మరోవైపు మహారాష్ట్రలోని పాల్ ఘర్ లోక్ సభ నియోజకవర్గానికి చెందిన ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందింది. బీజేపీ నుంచి రాజేంద్ర గవిత్ పోటీ చేయగా, శివసేన నుంచి శ్రీనివాస్ వనాగ బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి రాజేంద్ర ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 29వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News