ravishankar prasad: సాధారణ ఎన్నికల్లో మాత్రం మేమే గెలుస్తాం: కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

  • ఉప ఎన్నికల ఫలితాలు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి
  • మూడో కూటమి అనేది ముందుకు సాగే విషయం కాదు
  • దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేబట్టాం 

ప్రధానమంత్రి అవుతానని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పుకోవడంలో తమకు అభ్యంతరమేమీ లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ అన్నారు. ఈరోజు  హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈరోజు వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు ఆయా నియోజక వర్గాల స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని, సాధారణ ఎన్నికల్లో మాత్రం గెలుపు తమదేనని వ్యాఖ్యానించారు. దేశంలో మూడో కూటమి అనేది ముందుకు సాగే విషయం కాదని అన్నారు.

కాగా, భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. దేశంలో 120 మొబైల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేశామని, అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా చేశామని అన్నారు. నాలుగేళ్లలో 7 కోట్ల 25 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని, 2 లక్షల కిలో మీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు చేశామని, 80 కోట్ల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేశామని అన్నారు. హైదరాబాద్ నగరం దేశానికి ఐటీ సిటీగా మారిందని  కొనియాడారు.

  • Loading...

More Telugu News