Ganta Srinivasa Rao: అమెరికాలో పలు యూనివర్శిటీలను సందర్శిస్తున్న గంటా.. ఫీజు రాయితీలపై చర్చ

  • కెంటక్కీ రాష్ట్రంలో గంటా శ్రీనివాసరావు పర్యటన
  • రాష్ట్ర కేబినెట్ సెక్రటరీతో భేటీ
  • ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్, రీసెర్చ్, ఫీజు రాయితీలపై చర్చ

అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బిజీబిజీగా ఉన్నారు. కెంటక్కీ రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలను ఆయన సందర్శించారు. ఆ రాష్ట్ర కేబినెట్ సెక్రటరీ టెర్రీ గిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎర్రాన్ ప్రిస్తేతో ఆయన భేటీ అయ్యారు. ముఖ్యంగా కెంటక్కీ రాష్ట్రంలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులకు ఫీజు రాయితీలపై వారితో గంటా చర్చించారు. ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్, రీసెర్చ్ తదితర అంశాలపై ఒప్పందాలు చేసుకునే దిశగా సమావేశం కొనసాగింది. ఈ చర్చలు వాస్తవరూపం దాల్చితే... అమెరికాలో చదువుకోవాలనుకునే ఏపీ విద్యార్థులకు మరింత మేలు కలుగుతుంది. 

Ganta Srinivasa Rao
america
kentakki
universities
  • Loading...

More Telugu News