krishna: బయోపిక్ గురించి అడిగిన సుధీర్ బాబు .. స్పందించిన కృష్ణ

- సూపర్ స్టార్ కృష్ణగారి జన్మదినం
- శుభాకాంక్షలు తెలిపిన 'సమ్మోహనం' టీమ్
- అభినందించిన కృష్ణ
తెలుగు తెరకి సంబంధించినంత వరకూ ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తరువాత స్థానంలో కృష్ణ కనిపిస్తారు. ఒక వైపున హీరోగానూ .. మరో వైపున నిర్మాతగాను ఆయన ప్రయోగాలు .. సాహసాలు చేశారు. తెలుగు సినిమాకి భారీతనం తెచ్చిన నిర్మాతలలో ముందుగా కృష్ణ పేరు కనిపిస్తుంది. ఈ రోజు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా 'సమ్మోహనం' సినిమా టీమ్ కృష్ణని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసింది.
