website: పెళ్లీడు కొచ్చారా?.. మీకు ఎంత కట్నం వస్తుందో తెలుసుకోండి అంటోన్న వెబ్‌సైట్!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-97d5f22710d5513eb73d9a3b09c3001e26de6349.jpg)
- dowrycalculator.com వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత ఫిర్యాదు
- కట్నాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వ్యవహరిస్తోన్న వెబ్‌సైట్
- వయసు, కులం, ఉద్యోగ విషయాలు అడుగుతోన్న వైనం
మార్కెట్లో ఏ వస్తువు రేటు ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇంటర్నెట్‌ని ఆశ్రయిస్తాం. ఎన్నో కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొచ్చి ఇంట్లో నుంచే అన్ని విషయాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అలాగే, డౌరీ క్యాలుక్లేటర్ డాట్ కామ్ (dowrycalculator.com) అంటూ ఓ వెబ్‌సైట్ ఉంది. పెళ్లికి కట్నం తీసుకోవడం అనేది ఓ దురాచారమే కాక చట్టరీత్యా నేరమన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే వారు చాలా అరుదు.
ఈ విషయాన్నే క్యాష్ చేసుకుంటూ ఈ వెబ్‌సైట్... మీరు పెళ్లీడుకి వచ్చారా? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? మీకు వచ్చే కట్నం ఎంతో తెలుసా? అంటూ అబ్బాయి వయసు, కులం, ఉద్యోగం వంటి విషయాలు అడిగి అతడు పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం ఎంతో చెప్పేస్తోంది. ఆ తరువాత అధికంగా కట్నం లాగడానికి పలు సలహాలు కూడా ఇస్తోంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-00ad31eea798a1cf8cc0ffc0356621294a397381.jpg)