annapurna studios: అన్నపూర్ణ స్టూడియోలో పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పద మృతి

  • స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి మృతి
  • గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించిన స్టూడియో సిబ్బంది
  • హత్య చేశారని ఆందోళన చేస్తున్న బంధువులు

హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పని చేస్తున్న నారాయణరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన వయసు 53 ఏళ్లు. అయితే, ఆయన మృతదేహాన్ని స్టూడియో సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీని తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నారాయణరెడ్డిని ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానాన్ని ఆయన బంధువులు వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు, ఉస్మానియా ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, మరింత సమాచారం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లారు.

annapurna studios
murder
death
worker
  • Loading...

More Telugu News