rajanala: చివరి రోజుల్లో సీరియల్లో వేషం అడగడానికి రాజనాల రావడం బాధాకరం: నటుడు అడబాల

- రాజనాల గొప్ప నటుడు
- విలన్ అనగానే గుర్తొచ్చేది ఆయనే
- ఒకసారి పద్మాలయ స్టూడియోకి వచ్చారు
ఇటు వెండి తెరపైనా .. అటు బుల్లితెరపైన ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించిన 'అడబాల' మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తెలుగు పాప్యులర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'రాజనాల' గురించి ప్రస్తావించారు. "తెలుగు సినిమాల్లో విలన్ అనగానే ఎవరికైనా సరే రాజనాల గుర్తుకొస్తారు. అలాంటి రాజనాల ఒకసారి పద్మాలయ స్టూడియో మెట్లు ఎక్కలేక ఎక్కలేక ఎక్కి వచ్చారు. అక్కడ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది .. ఆయనని చూడగానే నేను నమస్కరించాను.
