Pacific Command: ఇండియా కోసం... 'పసిఫిక్ కమాండ్' పేరును మార్చిన యూఎస్ మిలటరీ!

  • పసిఫిక్ మహా సముద్రంలో పెరుగుతున్న భారత ప్రాముఖ్యత
  • కమాండ్ పేరును 'యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్'గా మార్చిన యూఎస్
  • వెల్లడించిన డిఫెన్స్ సెక్రెటరీ

పసిఫిక్ మహా సముద్రంలో పెరుగుతున్న భారత ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. యూఎస్ మిలటరీ ఆధ్వర్యంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న 'పసిఫిక్ కమాండ్' పేరును 'యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్'గా మార్చినట్టు పెంటగాన్ అధికారులు తెలిపారు. అత్యాధునిక విమాన వాహక నౌకలతో పాటు, వార్ షిప్ లతో ఉండే ఈ 3.75 లక్షల సైనిక బృందం, గ్రేటర్ పసిఫిక్ రీజియన్ లో పహారా కాస్తుంటుంది.

 "పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భాగస్వామ్య దేశాలతో మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్నాం. ఈ పరిధిలోని దేశాల్లో మరింత స్థిరత్వం కోసం ఈ పేరు మార్పు దోహదపడుతుంది" అని యూఎస్ ఢిఫెన్స్ సెక్రెటరీ జిమ్ మాటిస్ వెల్లడించారు. భారత్ కు, పసిఫిక్ మహా సముద్రానికి కనెక్టివిటీ పెరుగుతున్న ఈ తరుణంలో తాము పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

ఈ కమాండ్ కు ఇప్పటివరకూ అడ్మిరల్ హ్యారీ హారిస్ నేతృత్వం వహించగా, ఇకపై అడ్మిరల్ ఫిలిప్ డేవిడ్ సన్ ఆ బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. కాగా, హ్యారీ హ్యారిస్ ను దక్షిణ కొరియా రాయబారిగా నియమిస్తున్నట్టు ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News