Vizag: విశాఖ సాగరం అల్లకల్లోలం... ముందుకొచ్చిన సముద్రం!

  • రుతుపవనాలు, పౌర్ణమి రోజులు
  • సముద్రంలో డిప్రెషన్
  • అలల ఉద్ధృతి అధికం

ఓ వైపు రుతుపవనాలు, పౌర్ణమి రోజుల రాక, మరోవైపు సముద్రంలో డిప్రెషన్ కారణంతో విశాఖపట్నంలోని రుషికొండ, సాగర్ నగర్ ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. అల్లకల్లోలంగా కనిపిస్తూ, అలల ఉద్ధృతి కూడా అధికంగా ఉండటంతో, సముద్రంలోకి వెళ్లేందుకు పర్యాటకులు జంకుతున్నారు. కెరటాలు ఇసుక తిన్నెలను దాటి ముందుకు వస్తుండటంతో సాగర్ నగర్ బీచ్ చెరువులా మారిపోయింది. సముద్రపు నీటి ఆవిరి నగరంపైకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతను అనుభవిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.

Vizag
Beach
Depression
Monsoon
  • Loading...

More Telugu News