BJP: లోక్ సభలో మైనారిటీలో పడిపోయిన బీజేపీ?
- మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలకు ఉప ఎన్నికలు
- రెండు సీట్లను కోల్పోయే పరిస్థితుల్లో బీజేపీ
- లోక్ సభలో మరింత తగ్గిన బలం
నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు... అందులో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలే. ఏ ఒక్కటి కోల్పోయినా బీజేపీ లోక్ సభలో మైనారిటీలో పడుతుంది. ఈ పరిస్థితుల్లో మూడు స్థానాల్లో బీజేపీ ఓటమి దిశగా సాగుతుండటం, ఈ మూడూ కాంగ్రెస్ బలపరిచిన పార్టీల ఖాతాల్లోకి చేరనుండటంతో లోక్ సభలో బలాబలాల నంబర్ మారిపోనుంది. కైరానా, పాల్ ఘడ్, బండారా-గోందియాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలుకాగా, కైరానాను ఇప్పటికే బీజేపీ కోల్పోయింది.
పాల్ గఢ్ లో ఎన్సీపీ ఆధిక్యం కొనసాగుతుండగా, భండారా-గోందియా మాత్రం బీజేపీ కైవసమయ్యేలా ఉంది. ప్రస్తుతం బీజేపీ సంఖ్యాబలం 272 (స్పీకర్ కాకుండా) ఉండగా, ఇప్పటికే ఎంపీ కీర్తి ఆజాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. శత్రుఘ్న సిన్హా వంటి వారు అసమ్మతితో ఉన్నారు. ఇక కైరానా, పాల్ గఢ్ లో బీజేపీ ఓడిపోతే, బీజేపీ సంఖ్యా బలం మరింతగా పడిపోతుంది. అయితే, ఎన్డీయేలోని మిత్రపక్షాలకు సుమారు 12 సీట్లు వున్నాయి కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీలేదు.