Donald Trump: మా అమ్మమ్మకు క్షమాభిక్షను ప్రసాదించండి: ట్రంప్ ను కోరిన రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్

  • డ్రగ్స్ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న కిమ్ అమ్మమ్మ
  • రెండు దశాబ్దాలుగా పెరోల్ కూడా లభించలేదు
  • విముక్తి కలిగించాలని ట్రంప్ ను కోరిన కిమ్

డ్రగ్స్ కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న తన అమ్మమ్మ అలైస్ మేరీ జాన్సన్ (63)కు క్షమాభిక్ష పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హాలీవుడ్ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ కోరింది. ఇటీవలే ఓ బాక్సర్ కు ట్రంప్ క్షమాభిక్షను ప్రసాదించారు. దీంతో, తన అమ్మమ్మపై కూడా కనికరం చూపాలని ట్రంప్ ను ఆమె వేడుకున్నారు.

ఇప్పటికే ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్ తో ఈ కేసు గురించి కిమ్ పలు పర్యాయాలు చర్చించింది. తాజాగా ట్రంప్ ను కలిసిన ఆమె... కేసు గురించి ఆయనతో చర్చించింది. డగ్స్ కేసుపై మరోసారి విచారణ జరిపి, మేరీకి విముక్తి కలిగించాలని విన్నవించింది. కిమ్ తో సమావేశం గురించి ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. కిమ్ తో సమావేశం గొప్పగా జరిగిందని... జైలు శిక్షకు సంబంధించిన సంస్కరణలపై చర్చించామని ఆయన తెలిపారు.

1996లో డ్రగ్స్ ఆరోపణలతో మేరీని అరెస్ట్ చేశారు. ఆమెకు జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఆమెకు పెరోల్ కూడా లభించలేదు. గత రెండు దశాబ్దాలుగా ఆమె జైలు జీవితాన్ని గడుపుతున్నారు. 

Donald Trump
kim kardashian
aline mary johnson
bollywood
america
president
  • Loading...

More Telugu News