santosh shetty: వాటర్ ఫాల్స్ లో కొట్టుకుపోయి.. దుర్మరణం పాలైన కన్నడ సినీ దర్శకుడు

  • దక్షిణ కన్నడలోని ఎర్మయ్ ఫాల్స్ వద్ద షూటింగ్
  • వర్షాల కారణంగా ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం
  • అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సంతోష్ శెట్టి

వర్ధమాన దర్శకుడు సంతోష్ శెట్టి దుర్మరణంతో కన్నడ చలనచిత్ర రంగంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. మరో ఐదుగురితో కలిసి నిన్న ఉదయం దక్షిణ కన్నడలోని బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ వాటర్ ఫాల్స్ కు షూటింగ్ నిమిత్తం సంతోష్ వెళ్లారు.  

షూటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో, అదుపుతప్పి ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన కోసం చాలాసేపు గాలించగా, చివరకు విగతజీవిగా కనిపించారు. ఆయన మృతదేహాన్ని బెళ్తంగడికి తరలించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. సంతోష్ మరణం పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు.  

santosh shetty
kannada
director
dead
  • Loading...

More Telugu News